Salaried Employees Home Loan: ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగులకు హౌసింగ్ లోన్ వివరాలు!

 

Account Salaried person Home Loan detals

📖 చిన్నకథ – బ్యాంక్‌లో హౌసింగ్ లోన్ చర్చ

రాజు గారు స్మాల్ టౌన్‌లో పనిచేసే గౌరవనీయమైన ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. తన కుటుంబానికి ఇల్లు కొనాలని నిర్ణయించి బ్యాంక్‌కి వచ్చారు.

సురేష్: "నమస్తే రాజు గారు🙏, స్వాగతం. మీరు ఇల్లు గురించి అనుకుంటున్నారని విన్నాను. ముందుగా చెప్పాలి – ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం.

మీ కల నెరవేరడానికి నేను మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాను."

రాజు: "ధన్యవాదాలు సురేష్ గారు. కానీ లోన్ కోసం ఏ డాక్యుమెంట్స్, ఏ రూల్స్ ఉన్నాయో క్లియర్‌గా తెలియదు."

సురేష్ గారు: "సరే, మీ సాలరీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుందా?"

రాజు గారు: "అవును సార్, ప్రతినెలా క్రెడిట్ అవుతుంది."

సురేష్ గారు: "అయితే మీకు ఈ క్రింది పత్రాలు సిద్ధంగా ఉంటే లోన్ సులభంగా వస్తుంది…

🔹 హైలైట్ పాయింట్స్

  • ✅ KYC – ఆధార్ / పాస్‌పోర్ట్ / ఓటర్ ఐడీ
  • ✅ ఉద్యోగ ప్రూఫ్ – అపాయింట్‌మెంట్ లెటర్ / కంపెనీ ఐడీ
  • ✅ ఆదాయ ప్రూఫ్ – 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ + 3 నెలల సాలరీ స్లిప్స్
  • ✅ ప్రాపర్టీ ప్రూఫ్ – సేల్ అగ్రిమెంట్ / EC (13 సంవత్సరాల లింక్ తో)
  • ✅ ఇతర పత్రాలు – ఫోటోలు + అప్లికేషన్ ఫారం

📄 హౌసింగ్ లోన్‌కి కావలసిన పత్రాలు (Salary Person – Pvt / Govt)

1️⃣ KYC పత్రాలు (Identity & Address Proof)

  • ఐడెంటిటీ ప్రూఫ్: ఆధార్ కార్డు / పాస్‌పోర్ట్ / ఓటర్ ఐడీ / డ్రైవింగ్ లైసెన్స్
  • అడ్రస్ ప్రూఫ్: ఆధార్ కార్డు / పాస్‌పోర్ట్ / తాజా విద్యుత్ బిల్ / రేషన్ కార్డు

2️⃣ ఉద్యోగ సంబంధ పత్రాలు

  • ప్రైవేట్ ఉద్యోగులు: అపాయింట్‌మెంట్ లెటర్, సాలరీ ఇన్‌క్రిమెంట్ లెటర్ (ఉంటే), కంపెనీ ఐడీ కార్డు
  • గవర్నమెంట్ ఉద్యోగులు: అపాయింట్‌మెంట్ లెటర్ / సర్వీస్ రిజిస్టర్ కాపీ, లేటెస్ట్ ఇన్‌క్రిమెంట్ స్లిప్, ఎంప్లాయి ఐడీ కార్డు

3️⃣ ఆదాయ ప్రూఫ్ (Salary Credit Only)

  • గత 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ (సాలరీ ఎంట్రీలు స్పష్టంగా కనబడాలి)
  • గత 3 నెలల సాలరీ స్లిప్స్
  • Form 16 (ఉంటే – గత 2 సంవత్సరాలు)
💡 ఉదాహరణ: రాజు గారు ప్రతినెలా SBI అకౌంట్‌లో “ABC Pvt Ltd – Salary” అని క్రెడిట్ అవుతుంది → బ్యాంక్ స్టేట్‌మెంట్ + సాలరీ స్లిప్స్ చూపాలి.
Account Salaried person Home Loan detals

Link: NRI housing loan full information

4️⃣ ప్రాపర్టీ పత్రాలు (Legal Documents)

లీగల్ డాక్యుమెంట్స్ – 13 సంవత్సరాల లింక్ రూల్స్

లీగల్ డాక్యుమెంట్ అంటే – ప్రాపర్టీ మీది అని నిరూపించే పత్రాలు.

  • ఫ్రెష్ రిజిస్ట్రేషన్ (New Registration, bellow 13 years):
    • కొత్తగా రిజిస్టర్ అయిన సేల్ డీడ్.
    • బ్యాంకులు ఇలాంటి ప్రాపర్టీకి ఎక్కువ వడ్డీ (ROI – Rate of Interest) ఇస్తాయి.
  • 13 Years Link Documents:
    • గత 13 సంవత్సరాల EC (Encumbrance Certificate) + పాత సేల్ డీడ్ కాపీలు.
    • ROI సాధారణం గా తక్కువ.
  • Below 13 Years Link Documents:
    • 13 సంవత్సరాలకు తగ్గ లింక్ ఉన్న పత్రాలు.
    • లీగల్ క్లారిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి, ROI ఎక్కువ.
    • కొంతమంది బ్యాంకులు అంగీకరించకపోవచ్చు.
💡 Example:
  • 2005లో ప్రాపర్టీ రిజిస్టర్ అయింది → 2025లో మీరు కొనుగోలు →
  • 2012 – 2025 వరకు EC + 2005 – 2012 సేల్ డీడ్ ఉంటే = Full 13 Years Link ✅
  • 2015 – 2025 వరకు మాత్రమే EC ఉంటే = Below 13 Years Link ❌ (ROI ఎక్కువ)

💳 CIBIL స్కోర్ & లోన్ ఆమోదం

  • 750+ స్కోర్: ROI తక్కువ, ఫాస్ట్ ఆమోదం
  • 700–749: ROI కొంచెం ఎక్కువ, కానీ ఆమోదం వచ్చే అవకాశం ఉంది
  • 650–699: ఎక్కువగా NBFCలు మాత్రమే ఇస్తాయి, ROI ఎక్కువ
  • < 650: Bounces / Settlements ఉంటే మొదట CIBIL మెరుగుపరచాలి

బౌన్స్ / సెటిల్‌మెంట్ ప్రభావం

  • చెక్ బౌన్స్: సిబిల్ లో నెగటివ్ రికార్డ్ వస్తుంది → ROI పెరుగుతుంది.
  • లోన్ సెటిల్‌మెంట్: "SETTLED" అని సిబిల్ లో చూపుతుంది → కొత్త లోన్ అప్రూవల్ కష్టం.
  • సిబిల్ బాగుంటే: ROI తక్కువ, డాక్యుమెంట్స్ చెక్ స్మూత్ గా జరుగుతుంది.
Account Salaried person Home Loan detals

Link:- Cash Salary Persons House Purchase loan

📝 Housing Loanలో KYC పూర్తి వివరాలు:

1️⃣ Identity Proof (ID Proof)

  • ఆధార్ కార్డు (Aadhaar Card) – must be updated & active
  • Passport / Voter ID / Driving Licence (అదనపు ప్రూఫ్)
👉 Aadhaar మీద పేరు, DOB (Date of Birth), Gender Bank recordsకి match అవ్వాలి.

2️⃣ Address Proof

  • Current Address Door Number తప్పకుండ mention చేయాలి.
  • Electricity Bill / Property Tax Receipt / Rental Agreement
  • Aadhaarలోని address present addressతో match కాకపోతే, అదనపు proofs కావాలి.
👉 Banks EMI collect చేయడానికి ఈ address ఆధారంగా contact చేస్తాయి.

3️⃣ Bank Account Proof

  • Past 6 Months Bank Statement (Salary / Business credits కనిపించాలి).
  • Active Bank Accountలోనే EMI deduction జరుగుతుంది.
  • Cheque Leaves ఇవ్వాలి – 3 to 6 (security కోసం banks దగ్గర ఉంచుకుంటారు).

4️⃣ Aadhaar Linked Phone Number

👉 Aadhaarకి linked చేసిన mobile number activeగా ఉండాలి. E-KYC, OTP verifications, Bank Communication అన్నీ ఈ number మీదే depend అవుతాయి. Number inactive లేదా మార్చేస్తే, వెంటనే update చేయాలి.

5️⃣ Running Loan Tracks

👉 Bank / NBFCలు check చేసే ముఖ్యమైన point: మీరు ఇప్పటికే తీసుకున్న Running Loans (Car Loan, Personal Loan, Business Loan, Credit Card EMI) అన్నీ CIBILలో కనిపిస్తాయి. Loan burden ఎక్కువైతే కొత్త Housing Loan sanction చేయరు. Healthy Track అంటే – అన్ని EMIలు timeకి pay చేయడం.
✅ KYCలో small mistakes వలన కూడా loan reject అవుతుంది. ఉదా: Aadhaarలో surname తప్పుగా ఉండడం, Address mismatch, Bank statementsలో proper credit లేకపోవడం.

👉 సురేష్ గారి సూచన: "రాజు గారు 😊, KYC documents కరెక్ట్‌గా, updated‌గా ఉంటే Housing Loan process చాలా smoothగా జరుగుతుంది. కాబట్టి ముందుగానే Aadhaar, Bank Account, Address అన్ని సరిచూసుకోండి."

🏦 బ్యాంకుల రకాలూ: Nationalized Banks vs NBFC Banks

🏛 Nationalized Banks

  • SBI, Union Bank, Canara Bank, Bank of Baroda
  • ROI: 6.8%–8.5%
  • పత్రాల వెరిఫికేషన్ కఠినంగా
  • ప్రాసెస్ టైమ్ ఎక్కువ (7–15 రోజులు)

🏢 NBFC Banks

  • Cholamandalam, Aadhar Housing, Piramal Housing, UGRO Capital, Hinduja Housing, Indostar
  • ROI: 9%–13%
  • పత్రాల వెరిఫికేషన్ సులభం
  • ప్రాసెస్ టైమ్ తక్కువ (3–7 రోజులు)

5️⃣ నేషనల్ బ్యాంక్ vs NBFC – డిఫరెన్స్టేబుల్ (Table Format)

⭐ ముఖ్య హైలైట్స్:
  • ✔ సాలరీ అకౌంట్‌లో క్రెడిట్ కావాలి (కాష్ సాలరీ అంగీకరించరు)
  • ✔ ప్రాపర్టీ పత్రాలు క్లియర్‌గా ఉండాలి – లీగల్ వెరిఫికేషన్ పాస్ అవ్వాలి
  • ✔ 13 ఏళ్ల లింక్ డాక్యుమెంట్ ఉంటే ROI తక్కువ
  • ✔ లింక్ లేకపోతే ROI ఎక్కువ
  • ✔ NBFC – ఫాస్ట్ ప్రాసెస్, కానీ ROI ఎక్కువ
  • ✔ Nationalized – ROI తక్కువ, కానీ టైమ్ ఎక్కువ

📊 EMI లెక్కలు

1️⃣ ఉదాహరణ – ROI 7.50%

📌 EMI = ₹23,715/-
📌 మొత్తం చెల్లించేది = ₹28,45,800/-
📌 వడ్డీ మొత్తం = ₹8,45,800/-

2️⃣ ఉదాహరణ – ROI 12%

📌 EMI = ₹28,688/-
📌 మొత్తం చెల్లించేది = ₹34,42,560/-
📌 వడ్డీ మొత్తం = ₹14,42,560/-

📌తేడా – ROI తగ్గితే ఎంత సేవ్ అవుతుందో చూడండి

💡 వడ్డీ రేటు తక్కువగా ఉన్న బ్యాంక్ ఎంచుకుంటే లక్షల్లో సేవ్ అవుతుంది.

"సరైన బ్యాంక్, సరైన ROI ఎంపిక – మీ కలల ఇల్లు త్వరగా & తక్కువ ఖర్చులో"

🏦 Housing Loanలో మరికొన్ని ముఖ్యమైన విషయాలు

1️⃣ Processing Fees & Hidden Charges

👉 Banks సాధారణంగా Loan Amountపై 0.25% – 1% వరకు Processing Fees తీసుకుంటాయి.
👉 కొన్ని NBFCలు ఎక్కువ Processing Fees + Legal Opinion Charges కూడా collect చేస్తాయి.
Account Salaried person Home Loan detals

Link:- Improvement and Refinance Loan Extension Loan

📝 Final Note – Housing Loan కోసం అవసరమైన Basic Checklist

✅ Legal Property Documents

  • Sale Agreement Copy (సేల్ అగ్రిమెంట్ కాపీ)
  • Registration Papers (రిజిస్ట్రేషన్ పేపర్స్)
  • Approved Layout / Plan (అప్రూవ్డ్ లేయవుట్ / ప్లాన్)
  • 13 Years Link Documents (ఉంటే ROI తక్కువగా వస్తుంది ✅)
  • Encumbrance Certificate (EC)
  • Tax Paid Receipts (Property Tax)
⚠️ Important Reminder: అన్ని పత్రాలు సరైనవి & clearగా ఉండాలి. CIBIL Score 700+ ఉంటే Best ROI వస్తుంది. Legal Documents completeగా లేకపోతే Loan process delay అవుతుంది.

📢 మన చానెల్ – Telugu Loan Duniya

📞 పూర్తి వివరాల కోసం – ఇప్పుడే సంప్రదించండి! Phone/WhatsApp: 9490501203

📧 Email: teluguloanduniya@gmail.com

🌐 Facebook Page: facebook.com/teluguloanduniya

Account Salaried person Home Loan detals
⚠️ Disclaimer (నిరాకరణ): ఈ బ్లాగ్ పోస్ట్ కేవలం సమాచారం మరియు అవగాహన కోసం మాత్రమే అందించబడింది. లోన్ ఆమోదం మరియు వడ్డీ రేట్లు పూర్తిగా బ్యాంకులు / NBFCల నిర్ణయాలకు మరియు దరఖాస్తుదారు యొక్క CIBIL స్కోర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌పై ఆధారపడి ఉంటాయి. లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు, అన్ని నియమ నిబంధనలను దయచేసి సంబంధిత బ్యాంక్ / సంస్థ ద్వారా సరిచూసుకోండి. Telugu Loan Duniya సంస్థ ఈ సమాచారం యొక్క ఖచ్చితత్వం కోసం ఎటువంటి బాధ్యత వహించదు.

ఈ సమాచారం మీకు నచ్చితే, ఇప్పుడే లైక్ చేయండి & షేర్ చేయండి!

Comments