SME & బిజినెస్ ఓనర్స్‌కు హౌసింగ్ లోన్: తక్కువ వడ్డీకే హోమ్ లోన్ పొందే టెక్నిక్స్!

Telugu Loan Duniya


title="స్మాల్ & మీడియం బిజినెస్ ఓనర్స్ కోసం హౌసింగ్ లోన్ గైడ్"


రాజుగారు – ఒక చిన్న టౌన్‌లో మధ్యస్థ స్థాయి వ్యాపారవేత్త (Kirana/Cloth/Medical/Hardware Shop Owner). ఇప్పటివరకు Businessను బాగా రన్ చేస్తున్నారు. కుటుంబం కోసం ఒక Individual House లేదా Apartment కొనాలని నిర్ణయించారు.

💬 సురేష్‌గారు (బ్యాంక్ ఎగ్జిక్యూటివ్): "నమస్తే రాజుగారు 🙏, Business Persons‌కి Housing Loan Process కొంచెం వేరుగా ఉంటుంది.

కానీ సింపుల్‌గా మీకు చెప్పేస్తాను."

💬 రాజుగారు: "ధన్యవాదాలు సర్, కానీ బిజినెస్ పర్సన్స్‌కి డాక్యుమెంట్స్ ఏవి కావాలో తెలియదు."

💬 సురేష్‌గారు: "సరే, మీ బిజినెస్‌లో ఇన్‌కమ్ చూపగలిగితే హౌసింగ్ లోన్ సులభంగా వస్తుంది. మీరు సిద్ధం పెట్టాల్సిన పత్రాలు ఇవి… అయితే మీకు ఈ క్రింది పత్రాలు సిద్ధంగా ఉంటే లోన్ సులభంగా వస్తుంది…"

📌 కావలసిన ముఖ్య పత్రాలు (Business Owners)

1️⃣ KYC (Identity & Address Proof)

  • ఆధార్ / పాస్‌పోర్ట్ / ఓటర్ ఐడీ / డ్రైవింగ్ లైసెన్స్
  • విద్యుత్ బిల్ / రేషన్ కార్డు / పాస్‌పోర్ట్ (Address Proof)

2️⃣ బిజినెస్ ప్రూఫ్

  • GST Registration Certificate (ఉంటే)
  • Shop Act / Trade License
  • బిజినెస్ పేరు మీద రిజిస్ట్రేషన్ పేపర్స్
  • 3 సంవత్సరాల IT Returns

3️⃣ ఆదాయ ప్రూఫ్

  • గత 12 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ (Business Transactions కనిపించాలి)
  • ప్రాఫిట్ & లాస్ స్టేట్‌మెంట్ / బ్యాలెన్స్ షీట్ (CA సర్టిఫికేట్ ఉంటే బాగుంటుంది)
alt="SME ఓనర్స్ హౌసింగ్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు - GST, IT రిటర్న్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ మరియు KYC"

4️⃣ ప్రాపర్టీ పత్రాలు (Legal Documents)

  • Sale Agreement Copy (సేల్ అగ్రిమెంట్ కాపీ): ఇది Buyer & Seller మధ్య జరిగే మొదటి ఒప్పందం.
  • Registration Papers (రిజిస్ట్రేషన్ పేపర్స్): Propertyని Government Registration Officeలో Register చేసిన తరువాత ఇస్తారు.
  • Approved Layout / Plan (అప్రూవ్డ్ లేయవుట్ / ప్లాన్): Municipality / Gram Panchayat / Town Planning Dept నుండి ఆమోదం తీసుకున్న Plan.
  • 13 Years Link Documents (13 సంవత్సరాల లింక్ పత్రాలు): ఇది ఉంటే ROI తక్కువ అవుతుంది.
  • Encumbrance Certificate – EC (ఎంకంబరెన్స్ సర్టిఫికేట్): Propertyపై గత 13 సంవత్సరాలలో ఎవరికైనా Loan లేదా Legal Issues ఉన్నాయా అని చూపుతుంది.
  • Tax Paid Receipts (హౌస్ ట్యాక్స్/ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపు రసీదులు)
  • Occupancy Certificate (OC) / Completion Certificate (CC): Flat లేదా Apartmentలో ఇది తప్పనిసరి.
  • Mother Deed / Parent Document (తల్లి పత్రం): Property మొదట ఎక్కడి నుంచి వచ్చిందో చూపించే ముఖ్యమైన పత్రం.

📑 Housing Loan – Extra Legal Documents

లీగల్ డాక్యుమెంట్ అంటే – ప్రాపర్టీ మీది అని నిరూపించే పత్రాలు.

1️⃣ Encumbrance Certificate (EC)

Propertyకి గత 13 సంవత్సరాలలో ఎటువంటి బాదుడు (Loan, Mortgage, Court Case) లేదని చెబుతుంది. EC లేకుండా Banks Housing Loan sanction చేయవు.

2️⃣ No Objection Certificate (NOC)

Property Builder / Housing Society / Apartment Association నుండి తీసుకోవాలి. Propertyపై ఎటువంటి legal లేదా pending dues లేవని ఈ సర్టిఫికేట్ చెబుతుంది.

3️⃣ Possession Certificate

House లేదా Flat హ్యాండోవర్ అయిన తర్వాత Builder ఇచ్చేది. ఇది Propertyపై మీకు అధికారిక హక్కు వచ్చిందని ప్రూవ్ అవుతుంది.

4️⃣ Mutation Document

Property ownership transfer అయ్యాక Municipality / Panchayat records లో update చేయించుకోవాలి. దీని ఆధారంగా Property Tax కూడా మీ పేరుపై వస్తుంది.

5️⃣ Building Permission Letter

Municipality లేదా Panchayat నుండి constructionకు ఇచ్చిన approval. Illegal construction అయితే loan sanction అవదు.

6️⃣ Loan Clearance Certificate

Propertyపై ముందే loan ఉంటే, అది పూర్తిగా clear అయ్యిందని Bank నుండి certificate తీసుకోవాలి. ఇది లేకపోతే కొత్త loan sanction కష్టమవుతుంది.

లీగల్ డాక్యుమెంట్స్ – 13 సంవత్సరాల లింక్ రూల్స్

లింక్ రకం వివరణ ROI ప్రభావం
ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కొత్తగా రిజిస్టర్ అయిన సేల్ డీడ్ (13 ఏళ్ల లోపు). బ్యాంకులు ఎక్కువ వడ్డీ (ROI) ఇస్తాయి.
13 Years Link Documents గత 13 సంవత్సరాల EC + పాత సేల్ డీడ్ కాపీలు. ROI సాధారణంగా తక్కువ.
Below 13 Years Link 13 సంవత్సరాలకు తగ్గ లింక్ ఉన్న పత్రాలు. లీగల్ క్లారిటీ తక్కువ, ROI ఎక్కువ.

💡 Loan Eligibility

  • Business Income + Property Value ఆధారంగా Eligibility Calculate అవుతుంది.
  • సాధారణంగా Business Persons‌కి Loan Limit ఎక్కువగా వస్తుంది (30L–1Cr వరకు కూడా అవకాశం ఉంటుంది).
  • కానీ Documents Strong‌గా ఉండాలి (ITR + Bank Statement తప్పనిసరి).

💡 Example: 2005లో ప్రాపర్టీ రిజిస్టర్ అయింది → 2025లో మీరు కొనుగోలు →

  • 2012 – 2025 వరకు EC + 2005 – 2012 సేల్ డీడ్ ఉంటే = Full 13 Years Link ✅
  • 2015 – 2025 వరకు మాత్రమే EC ఉంటే = Below 13 Years Link ❌ (ROI ఎక్కువ)

💳 CIBIL స్కోర్ & లోన్ ఆమోదం

  • 750+ స్కోర్: ✅ ROI తక్కువ, ఫాస్ట్ ఆమోదం.
  • 700–749: 🔶 ROI కొంచెం ఎక్కువ, కానీ ఆమోదం వచ్చే అవకాశం ఉంది.
  • 650–699: 🔶 ఎక్కువగా NBFCలు మాత్రమే ఇస్తాయి, ROI ఎక్కువ.
  • < 650: ❌ Bounces / Settlements ఉంటే మొదట CIBIL మెరుగుపరచాలి

బౌన్స్ / సెటిల్‌మెంట్ ప్రభావం

  • చెక్ బౌన్స్: సిబిల్ లో నెగటివ్ రికార్డ్ వస్తుంది → ROI పెరుగుతుంది.
  • లోన్ సెటిల్‌మెంట్: "SETTLED" అని సిబిల్ లో చూపుతుంది → కొత్త లోన్ అప్రూవల్ కష్టం.
  • సిబిల్ బాగుంటే: ROI తక్కువ, డాక్యుమెంట్స్ చెక్ స్మూత్ గా జరుగుతుంది.
alt="వ్యాపారులకు హోమ్ లోన్ ఆమోదంపై CIBIL స్కోర్ ప్రభావం - 750+ స్కోర్‌కు వేగంగా లోన్ ఆమోదం లభిస్తుంది"

📝 Housing Loanలో KYC పూర్తి వివరాలు

(KYC డాక్యుమెంట్ల గురించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ➡️ Read More)

1️⃣ Identity Proof (ID Proof)

  • ఆధార్ కార్డు (Aadhaar Card) – must be updated & active
  • Passport / Voter ID / Driving Licence (అదనపు ప్రూఫ్)
  • 👉 Aadhaar మీద పేరు, DOB (Date of Birth), Gender Bank recordsకి match అవ్వాలి.

2️⃣ Address Proof

  • Current Address Door Number తప్పకుండ mention చేయాలి.
  • Electricity Bill / Property Tax Receipt / Rental Agreement
  • 👉 Banks EMI collect చేయడానికి ఈ address ఆధారంగా contact చేస్తాయి.

3️⃣ Bank Account Proof

  • Past 6 Months Bank Statement (Salary / Business credits కనిపించాలి).
  • Active Bank Accountలోనే EMI deduction జరుగుతుంది.
  • Cheque Leaves ఇవ్వాలి – 3 to 6 (security కోసం banks దగ్గర ఉంచుకుంటారు).

4️⃣ Aadhaar Linked Phone Number

  • 👉 Aadhaarకి linked చేసిన mobile number activeగా ఉండాలి.
  • E-KYC, OTP verifications, Bank Communication అన్నీ ఈ number మీదే depend అవుతాయి.

5️⃣ Running Loan Tracks

  • 👉 మీరు ఇప్పటికే తీసుకున్న Running Loans (Car Loan, Personal Loan) అన్నీ CIBILలో కనిపిస్తాయి.
  • Loan burden ఎక్కువైతే కొత్త Housing Loan sanction చేయరు.
✅ KYCలో small mistakes వలన కూడా loan reject అవుతుంది. ఉదా: Aadhaarలో surname తప్పుగా ఉండడం, Address mismatch.

👉 సురేష్ గారి సూచన: "రాజు గారు 😊, KYC documents కరెక్ట్‌గా, updated‌గా ఉంటే Housing Loan process చాలా smoothగా జరుగుతుంది. కాబట్టి ముందుగానే Aadhaar, Bank Account, Address అన్ని సరిచూసుకోండి."

🏦 Nationalized Banks vs NBFC Banks

🏛 Nationalized Banks

  • SBI, Union Bank, Canara Bank, Bank of Baroda
  • ROI: 6.8%–8.5%
  • పత్రాల వెరిఫికేషన్ కఠినంగా ఉంటుంది
  • ప్రాసెస్ టైమ్ ఎక్కువ (7–15 రోజులు)

🏢 NBFC Banks

  • Cholamandalam, Aadhar Housing, Piramal Housing, UGRO Capital
  • ROI: 9%–13%
  • పత్రాల వెరిఫికేషన్ సులభం
  • ప్రాసెస్ టైమ్ తక్కువ (3–7 రోజులు)
alt="నేషనల్ బ్యాంక్ vs NBFC ల వడ్డీ రేట్లు (ROI) మరియు ప్రాసెస్ టైమ్ పోలిక"

నేషనల్ బ్యాంక్ vs NBFC – డిఫరెన్స్ టేబుల్

అంశం నేషనల్ బ్యాంక్ NBFC
వడ్డీ రేటు (ROI) తక్కువ ఎక్కువ
ప్రాసెస్ టైమ్ ఎక్కువ తక్కువ
డాక్యుమెంట్స్ స్ట్రిక్ట్ ఫ్లెక్సిబుల్
CIBIL ఇంపార్టెన్స్ హై మోస్తరు

⭐ ముఖ్య హైలైట్స్

  • ✅ Shop Act / Trade License, GST Registration Certificate (ఉంటే), బిజినెస్ పేరు మీద రిజిస్ట్రేషన్ పేపర్స్.
  • ✅ ప్రాపర్టీ పత్రాలు క్లియర్‌గా ఉండాలి – లీగల్ వెరిఫికేషన్ పాస్ అవ్వాలి.
  • ✅ 13 ఏళ్ల లింక్ డాక్యుమెంట్ ఉంటే ROI తక్కువ.
  • ✅ లింక్ లేకపోతే ROI ఎక్కువ.
  • ✅ NBFC – ఫాస్ట్ ప్రాసెస్, కానీ ROI ఎక్కువ.
  • ✅ Nationalized – ROI తక్కువ, కానీ టైమ్ ఎక్కువ.

📌 ROI ఉదాహరణ

  • SBI (National Bank): 7.5% to 9 % ROI (ఫ్రెష్ రిజిస్ట్రేషన్ / 13 ఏళ్ల లింక్ ఉన్న ప్రాపర్టీ)
  • UGRO Capital (NBFC): 10.5% to 15 % ROI (లింక్ డాక్యుమెంట్ లేకుండా పాత ప్రాపర్టీ)

💬 సురేష్‌గారు: "రాజు గారు, మీ Business Strongగా ఉంటే & ITR Regularగా ఉంటే National Bankలో ROI తక్కువగా వస్తుంది. ITR లేదా CIBIL Strong‌గా లేకపోతే NBFCలో Approval త్వరగా వస్తుంది కానీ ROI ఎక్కువ అవుతుంది. మీ అవసరానికి సరైన Bank Option నేను Suggest చేస్తాను."

EMI లెక్కలు (₹20,00,000 – 10 ఏళ్ల కాలానికి)

1️⃣ ఉదాహరణ – ROI 7.50%

  • Loan Amount (P) = ₹20,00,000
  • Annual ROI = 7.50% → Monthly R = 0.00625
  • Period (N) = 10 Years = 120 Months
  • 📌 EMI = ₹23,715/-
  • 📌 మొత్తం చెల్లించేది = ₹28,45,800/-
  • 📌 వడ్డీ మొత్తం = ₹8,45,800/-

2️⃣ ఉదాహరణ – ROI 12%

  • Loan Amount (P) = ₹20,00,000
  • Annual ROI = 12% → Monthly R = 0.01
  • Period (N) = 10 Years = 120 Months
  • 📌 EMI = ₹28,688/-
  • 📌 మొత్తం చెల్లించేది = ₹34,42,560/-
  • 📌 వడ్డీ మొత్తం = ₹14,42,560/-

తేడా – ROI తగ్గితే ఎంత సేవ్ అవుతుందో చూడండి

ROI EMI మొత్తం వడ్డీ Difference in Interest
7.50% ₹23,715 ₹8,45,800
12% ₹28,688 ₹14,42,560 ₹5,96,760 అదనంగా చెల్లించాలి
💡 వడ్డీ రేటు తక్కువగా ఉన్న బ్యాంక్ ఎంచుకుంటే లక్షల్లో సేవ్ అవుతుంది. "సరైన బ్యాంక్, సరైన ROI ఎంపిక – మీ కలల ఇల్లు త్వరగా & తక్కువ ఖర్చులో"

🏦 Housing Loanలో మరికొన్ని ముఖ్యమైన విషయాలు

1️⃣ Processing Fees & Hidden Charges

Banks సాధారణంగా Loan Amountపై 0.25% – 1% వరకు Processing Fees తీసుకుంటాయి. కొన్ని NBFCలు ఎక్కువ Processing Fees + Legal Opinion Charges కూడా collect చేస్తాయి.

2️⃣ Insurance Requirement

Banks చాలాసార్లు Housing Loanతో పాటు Property Insurance లేదా Loan Insurance కూడా link చేస్తాయి. ఇది తప్పనిసరి కాదు కానీ Banks "సేఫ్టీ" పేరుతో insist చేస్తాయి.

3️⃣ Prepayment & Foreclosure Charges

Nationalized Banksలో (Floating ROI) Prepayment Charges ఉండవు. NBFCలలో చాలా సార్లు 2%–4% వరకు penalty వేస్తారు.

4️⃣ Government Subsidy Schemes (PMAY)

Eligible అయితే Central Government subsidy ₹2.67 Lakhs వరకు వస్తుంది. ఈ స్కీమ్ Mainly First-Time Home Buyersకి మాత్రమే ఉంటుంది.

5️⃣ Women Ownership Benefits

Propertyను Wife / Mother పేరు మీద కొనుగోలు చేస్తే Registration Chargesలో 1% తగ్గింపు మరియు కొన్ని Banksలో ROI 0.05%–0.10% తక్కువగా ఇస్తారు.

6️⃣ Tax Benefits

Home Loan EMIలోని Principal (Sec 80C) & Interest (Sec 24B) మీద tax benefit claim చేయొచ్చు.

alt="SME ఓనర్స్ హౌసింగ్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు - GST, IT రిటర్న్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ మరియు KYC"

⚠️ Risk Categories (Loan Reject అయ్యే పరిస్థితులు)

1️⃣ Agriculture Income మాత్రమే ఉన్నవారు

Banks Housing Loan ఇవ్వరు (Commercial property లేదా agriculture loan తప్ప).

2️⃣ Complete Cash Transactions

ఆదాయం మొత్తం Cashలో ఉంటే & Proof లేకపోతే Loan reject అవుతుంది.

3️⃣ Property Disputes ఉన్నవి

Propertyపై Court Case / Dispute ఉంటే Loan sanction అవదు.

4️⃣ Low CIBIL Score (650 కన్నా తక్కువ)

Nationalized Banks reject చేస్తాయి. NBFCలు మాత్రమే consider చేస్తాయి కానీ ROI ఎక్కువగా ఉంటుంది.

5️⃣ Previous Loan Bounce / Settlement History

Loan EMI bounce history ఉంటే, Banks నమ్మకం పెట్టుకోవు.

6️⃣ Illegal Layouts / Non-Approved Properties

Grama Kantam / Non-DTCP approved sitesకి Loan sanction కష్టం.

📝 Final Note – Housing Loan కోసం అవసరమైన Basic Checklist

✅ వ్యక్తిగత వివరాలు

  • ప్రస్తుత Door Number & Address
  • Date of Birth
  • Aadhaar-linked Mobile Number & Email ID

✅ Salaried Employees

  • Minimum 2 Years Job Experience
  • Salary Slips – గత 3 నెలలు
  • Bank Statement – గత 6 నెలలు

✅ Self-Employed / Business Persons

  • Business Proof (GST / Shop Act / Trade License)
  • గత 2 Years Bills / Turnover Proof
  • ITR లేదా GST Returns

✅ Legal Property Documents

  • Sale Agreement Copy
  • Registration Papers
  • Approved Layout / Plan
  • 13 Years Link Documents (ఉంటే ROI తక్కువగా వస్తుంది ✅)
  • Encumbrance Certificate (EC)
  • Tax Paid Receipts (Property Tax)

✅ Co-Applicant (అవసరమైతే)

  • Spouse / Family Member ID Proof & Income Proof
⚠️ Important Reminder
👉 అన్ని పత్రాలు సరైనవి & clearగా ఉండాలి.
👉 CIBIL Score 700+ ఉంటే Best ROI వస్తుంది.
👉 Employment లేదా Business Continuity minimum 2 years ఉండాలి.
👉 Legal Documents completeగా లేకపోతే Loan process delay అవుతుంది.

📢 మన చానెల్ – Telugu Loan Duniya

🎯 మన చానెల్‌ని Follow, Like, Subscribe చేస్తే మీకు లాభాలు:

🎯 మీరు Friends & Familyకి Share చేస్తే లాభాలు:

  • ➡️ వారు సరైన బ్యాంక్‌ని ఎంచుకునే అవకాశం
  • ➡️ ROIలో వందల, వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు
  • ➡️ ఫాస్ట్ లోన్ అప్రూవల్ కోసం సీక్రెట్ టిప్స్ పొందవచ్చు

📞 పూర్తి వివరాల కోసం – ఇప్పుడే సంప్రదించండి!

  • 📧 Email: teluguloanduniya@gmail.com
  • 📱 Phone/WhatsApp: 9490501203
  • 👤 Contact Person: Bandaru Suresh
  • 🌐 Facebook Page: facebook.com/teluguloanduniya
© 2025 Telugu Loan Duniya. All rights reserved.
Disclaimer: ఈ పోస్ట్‌లోని సమాచారం 'Telugu Loan Duniya' యొక్క సొంతం. మా అనుమతి లేకుండా కాపీ చేయడం లేదా మరొకచోట ప్రచురించడం చట్టరీత్యా నేరం.
alt="తెలుగు లోన్ దునియాను సంప్రదించండి - YouTube, Instagram, మరియు Facebook పై ఫాలో అవ్వండి"

Disclaimer (ముఖ్య గమనిక)

ఈ పోస్ట్‌లో అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది 'Telugu Loan Duniya' అందిస్తున్న సాధారణ సమాచారం. లోన్ వడ్డీ రేట్లు (ROI) మరియు బ్యాంక్ నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.

ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు, దయచేసి సంబంధిత బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, ప్రస్తుత నిబంధనలు మరియు వడ్డీ రేట్లను పూర్తిగా నిర్ధారించుకోవాల్సిందిగా మనవి. మీ తుది నిర్ణయానికి మా బ్లాగ్ బాధ్యత వహించదు.

ఈ సమాచారం మీకు నచ్చితే, ఇప్పుడే లైక్ చేయండి & షేర్ చేయండి!

Comments